calender_icon.png 12 July, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పరామర్శ

11-07-2025 11:51:59 PM

పెన్ పహాడ్: మండలంలోని పలు గ్రామాలలో బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా శుక్రవారం మండలం లోని అన్నారం గ్రామంలో ప్రమాదశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన నాగయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన దొంతగాని కృష్ణయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దోసపహాడ్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు దొంగరి ధనమ్మ, అంతేకాకుండా చెట్ల ముకుందాపురంకు చెందిన మామిడి శ్రీను అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు జగదీశ్ రెడ్డి మృతుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి  కుటుంబ సభ్యులను ఓదార్చారు.