calender_icon.png 5 November, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగాచీ ఎండీకి హైకోర్టు నోటీసులు

05-11-2025 12:52:10 AM

రూ. కోటి పరిహారం ఎప్పుడిస్తారు?

హైకోర్టు పశ్న 

రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి) : తీవ్ర విషాదం నింపిన సిగాచీ పరి శ్రమ ప్రమాద ఘటనలో ఆ కంపెనీ ఎండీ కి మంగళవారం తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. మృతుల, బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో కౌం టర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గత జులై 1న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని పరిశ్రమలో భారీ పేలు డు సంభవించి మూడంతస్తుల భవనం పేకమేడలా కూలిపోయిం ది.

ఈ ఘటనలో 54 మంది కార్మికులు చనిపోయారు. ఈ ఘటనపై కలపాల బాబురావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశా రు. దీనిపై మంగళవారం హైకోర్టు విచారించింది. పిటిషనర్ తరఫున వసుధానాగరాజు వాదనలు వినిపించారు. ఈ ఘటనలో 54 మంది మృతి చెందారని, ప్రమాదం జరిగి 4 నెలలు గడిచినా ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పిటిషనర్ తరఫున లాయర్ వాదించారు. బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు ఆ పరిహారం అందించలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

అలాగే ఈ పరిశ్రమలో ఎన్నో ఉల్లంఘనలు జరిగినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఏఏజీ తమ వాదనలు వినిపిస్తూ.. ఈ ప్రమాదంలో సిగాచీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ సైతం చనిపోయారని కోర్టుకు తెలిపారు. దీంతో కంపెనీ యాజమాన్యంతో పాటు ఇతరులు కూడా ప్రమాదం బారిన పడ్డారు కదా అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని కూడా హైకోర్టు ప్రశ్నించింది.

మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు చెల్లించామని, కంపెనీ నుంచి మిగతా డబ్బులు వచ్చేలా చూస్తున్నామని ఏఏజీ తెలిపారు. 192 మంది ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారని తెలిపారు. పోలీసులు సైతం నిపుణులు కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారని కోర్టుకు వివరించగా, రెండు వారాల్లో సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.