calender_icon.png 5 November, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడులు పెట్టండి

05-11-2025 12:50:05 AM

-టీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో ప్రోత్సాహకాలు అందిస్తాం

-జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి 

-తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాష నేర్పించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి) : పెట్టుబడుల విషయంలో తెలం గాణ రాష్ట్రం జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగా ల్లో జర్మనీ కంపెనీలు తమ వద్ద పెట్టుబడు లు పెట్టాలని  కోరారు. జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నినాసంలో భేటీ అయ్యారు. డాయి బోర్సే కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో తమ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి జర్మనీ బృందం తెలిపింది. జీసీసీ ఏర్పాటుకు గాను తమ సిటీని ఎంచుకున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డి జర్మనీ ప్రతినిధి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రపంచ దేశాల నుంచి మరిన్ని పెట్టుబడులు రావాలని,  వారికి ప్రజా ప్రభుత్వం పూర్తి మద్దతును ఇస్తూ సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో  నెలకొల్పబోయే డాయి బోర్సే కంపెనీ జీసీసీ ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వబోతోందని తెలిపారు. ఇక హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని సీఎం కోరారు. నగరంలో జర్మన్ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మన్ భాషను నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్‌కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా టామ్‌కామ్  ద్వారా వోకేషనల్ ఎడ్యుకే షన్, స్కిల్ వర్క్ విషయంలో శిక్షణ అందించేందుకు సహకరించాలని విన్నవించారు. ఈ భేటీలో అమితా దేశాయ్, డాయి బోర్సేసీఐవో, డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి  పాల్గొన్నారు.

సీఎంతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం భేటీ  

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఏడబ్ల్యూఎస్ ఆన్‌గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులు, విస్తరణ తదితర అంశాలపై సీఎంతో చర్చించారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలుంటాయని సీఎం స్పష్టం చేశారు. ఈ భేటీలో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కెర్రీ పర్సన్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాక్ కిల్నాని తదితరులు పాల్గొన్నారు.