calender_icon.png 5 November, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రస్ట్ ఏర్పాటు!

05-11-2025 12:55:16 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రత్యేక కమిటీ

ప్రత్యేక ట్రస్టు ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయనున్న కమిటీ 

మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదంపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. గత కొంతకాలంగా పేరుకుపోయిన ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు ఈనెల 3 నుంచి నిరవధిక బంద్‌ను చేపట్టడంతో ఎట్టకేలకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై సమగ్ర అధ్యయ నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది.

ప్రత్యేక ట్రస్టు ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ అధ్యయనం చేయాలని ఆదేశించింది. అయితే అక్టోబర్ 28న విడుదల చేసిన ఈ జీవో మంగళవారం బయటకు వచ్చింది. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సీఎస్ కే రా మకృష్ణారావు జీవో నెం.19ను విడుదల చేశారు. గత కొంతకాలంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం తీవ్ర జా ప్యంచేస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నది. 

3 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక..

ఫీజు రీయింబర్స్‌మెంట్ పాలసీపై సమ గ్ర అధ్యయనం చేసేలా మొత్తం 15 మంది తో కమిటీని ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వ్యవహరించనున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, కంచ ఐలయ్య, ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శులు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌తోపాటు ఉన్న త విద్యాసంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఫీజు రీయిం బర్స్‌మెంట్ విధానంపై ఈ కమిటీ సమీక్ష చేసి, ప్రభుత్వానికి పలు సూచనలు చేయా ల్సి ఉంటుంది. మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వనుంది. గతంలో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల స మాఖ్య (ఫతి) ప్రత్యేక ట్రస్టు లేదా బ్యాంక్ ద్వారా ప్రభుత్వంపై భారం పడకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులపై ప్రతిపాదనలను డిప్యూటీ సీఎ భట్టి విక్రమార్కు అందజేసింది. అయితే ప్ర త్యేక ట్రస్టు ద్వారా రీయింబర్స్‌మెంట్ అమలు చేసే అవకాశాలను కూడా ఈ కమిటీ పరిశీలించనుంది. అంతేకాకుండా విద్యాసంస్థలు గతంలో అందించిన, మళ్లీ అందించే సలహాలు, సూచనలు సైతం ఈ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.

తనిఖీలు బంద్..

రాష్ట్రంలోని కాలేజీల్లో తనిఖీలు బంద్ అయినట్లు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తెలిపాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 3 నుంచి రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలన్నీ నిరవధిక బంద్‌ను పాటిస్టున్నాయి. ఫీజు బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వంపై కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొస్తుండటంతో అసలు కాలేజీలు విద్యాప్రమాణాలను సక్రమంగా పాటిస్తున్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు విజిలెన్స్ తనిఖీలకు ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీచేసింది. అన్ని వర్సిటీ పరిధిల్లోని కాలేజీల్లో తనిఖీలు చేపట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే దీనికంటే ముందే కాలేజీలు బంద్‌కు వెళ్లడంతో ఈ తనిఖీలు ఆగినట్లుగా కాలేజీల యాజమాన్యాలు పేర్కొన్నాయి. తాము బంద్‌లో ఉన్నామని తనిఖీలకు ఇప్పుడు సహకరించబోమని విజిలెన్స్ అధికారులకు బదులిచ్చినట్లు తెలిసింది.

కమిటీలో..

1. సంక్షేమశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీచైర్మన్

2. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్

3. విద్యాశాఖ కార్యదర్శిసభ్యుడు

4. ఎస్సీడెవలప్‌మెంట్ కార్యదర్శి

5. బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి

6. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి

7. మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి

8. ఉన్నతవిద్యామండలి చైర్మన్

9. ఎస్సీ డెవలప్‌మెంట్ విభాగం కమిషనర్

10. ప్రొఫెసర్ కంచె ఐలయ్య

11. ప్రొఫెసర్ కోదండరాం

12. ముగ్గురు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రతినిధులు

13. చైర్మన్ నిర్ణయించే మరొక వ్యక్తి