30-07-2025 11:55:32 PM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు
హైదరాబాద్ (విజయక్రాంతి): దశాబ్దాలపాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాంగ్రెస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి తాకట్టు పెట్టారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు(BRS MLC Takkallapalli Ravinder Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక విడుదల చేశారు. మీనాక్షి నటరాజన్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తుండటాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని, సెక్రటేరియట్‌లో ప్రభుత్వ అధికార యంత్రాంగంతో ఆమె సమీక్షలు జరపడం ఏమిటని ప్రశ్నించారు. సిగాచీ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం ఘటనలో మంత్రులతో రివ్యూ చేయడం ఏమిటని, సీఎంకి వివరాలు చెప్పాల్సిన మంత్రులు మీనాక్షికి చెప్పడంలో ఆంతర్యం ఏమిటన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ఇన్‌ఛార్జి ఏనాడైనా పాదయాత్ర చేసిన చరిత్ర ఉన్నదా, ఇప్పుడెందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణలోని అన్నివర్గాల ప్రజలు రేవంత్ అవినీతి, చేతగాని పాలనను గమనిస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని రవీందర్ రావు హెచ్చరించారు.