calender_icon.png 7 September, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరిక శ్యామల్ నాయకుని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు

07-09-2025 08:55:27 PM

ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ సాంస్కృతిక కార్యదర్శి, రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మృదు స్వభావి, సున్నిత మనస్కులు ప్రజలలో మంచి పేరు కలిగి, ఆటపాటలతో మైమరిపించే మనసు కలిగి  జిల్లా వ్యాప్తంగా కళా ప్రదర్శన గావించి కలల ద్వారా సామాజిక న్యాయం జరుగుటకు కృషిచేసిన పోరిక శ్యామల్ నాయక్ అనారోగ్యానికి గురై తన ఇంటి వద్ద చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా ఆదివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు(BRS Party District President Lakshmana Rao) పరామర్శించి ఏదైనా సాయం కావాలంటే తనను ఎల్ల వేళల సంప్రదించాలని, తన సేవలు పార్టీకి, ప్రజలకు అవసరమని బీఆర్ఎస్ పార్టీ తరపున హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ గ్రంధాలయ చైర్మన్ గోవింద్ నాయక్, రెడ్డి, ఒజ్జల ఓదెలు (బుల్లెట్) సురేష్, కవ్వంపల్లి బాబు తదితరులున్నారు.యోగక్షేమాలు ఆరాదీసిన వారి వివరాలు లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులు కుమార్ పాద్య, గుర్రంపేట మాజీ సర్పంచ్ జగన్, మధు స్వామి, గాయత్రీ మంత్ర ఉపాసకులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ జిల్లా అధ్యక్షులు పాల్తియా సారయ్య, సునీల్ నాయకులున్నారు.

శ్యామల నాయక్ కళాబృందం సభ్యులు బోదానంద వనమాల గాయని రమ్య,అర్జున్ తదితరులు పరామర్శించి త్వరగా కోలుకోవాలన్నారు. అయ్యగారు శ్రీనివాసాచారి, పాస్టర్లు జనార్ధన్, బాబురావు, మహేష్, డానియల్ తదితరులు త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు జన్ను రవి, నెమలి నరసయ్య చరవానిలో సంప్రదించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారన్నారు.ప్రజాసేన రాష్ట్ర నాయకులు బొమ్మ కంటి రమేష్ వర్మ పరామర్శించి మాట్లాడుతూ ఏడుపదుల వయసులో కూడా యవ్వన పాత్రలు చేస్తూ కళా పాత్రలు చేయడం అపురూపాద్భుతం అన్నారు. వారి వెంట ప్రజాసేన పార్టీ నాయకులున్నారు. అనంతరం సిపిఐ, సిపిఎం నాయకులు జంపాల రవీందర్, రాజులు పరామర్శించి. జంపాల రవీందర్ మాట్లాడుతూ ఏదైనా టికెట్ పై పోరిక శ్యామల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే మా మద్దతు తనకే ప్రకటించి మా పార్టీ నుండి అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలుపమన్నారు ఏఐకేఎస్ రైతు కూలీ సంఘం నాయకులు ప్రసాదన్న మాట్లాడుతూ 1985 నుండి ఐలాపురం,కాటాపురం, తుపాకులగూడెం ఏజెన్సీ ప్రాంత పాఠశాలల్లో శ్యామల నాయక్ వార్డెన్ గా పనిచేయుచు మారుమూల ప్రాంత ప్రజలకు సెలవు దినాలలో తన కళలు ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం తెచ్చేవాడనీ త్వరగా కోలుకోవాలన్నారు. తదితర మిత్ర గణం శ్యామల నాయక్ కళల గూర్చి మాట్లాడుతూ త్వరగా కోలుకొని మళ్లీ మా మధ్యకు నిస్వార్థ రాజకీయ నాయకుడై రావాలన్నారు.