10-12-2025 08:11:08 PM
అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధి చూపిస్తా..
బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పోశాల అనిత వీరమల్లు..
వెంకటాపూర్(రామప్ప) (విజయక్రాంతి): అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధి చూపిస్తానని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పోశాల అనిత వీరమల్లు అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతి సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినిగా బరిలో దిగిన పోశాల అనిత వీరమల్లు ఎన్నికల ప్రచారాన్ని రోజురోజుకు మరింత వేగవంతం చేశారు. నామినేషన్ అనంతరం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి మద్దతును సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన ఆయన, గ్రామంలోని ప్రతి వాడా, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల ఆత్మీయ స్వాగతం అందుకుంటున్నారు.
గ్రామంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్న వారు స్థానిక సమస్యలను నేరుగా ప్రజల వద్దే తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. డ్రైనేజీ, చెత్త నిర్వహణ, కాలువలు, వీధిదీపాలు, రైతుల సమస్యలు వంటి అంశాలను తన ముఖ్య ఎజెండాగా ప్రజలకు వివరిస్తున్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువ కార్యకర్తలు, మహిళలు పాల్గొంటూ ఇంటింటికీ వెళ్లి అభ్యర్థి తరఫున ఓటును అభ్యర్థిస్తున్నారు. స్థానికుల సమస్యలను ఓపికగా వినుతున్న అనిత వీరమల్లు, “గ్రామాభివృద్ధి నా ప్రధమ లక్ష్యం. ప్రతి కుటుంబం సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేస్తా” అని తెలియజేశారు.