27 August, 2026 | 1:39 AM

సాగునీటి కోసం మహా ధర్నాకు బైక్ ర్యాలీతో బయలుదేరిన బీఆర్‌ఎస్ శ్రేణులు

27-08-2026 12:00 AM

సాగర్ జలాలు విడుదల చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణుల డిమాండ్

గరిడేపల్లి, ఆగస్టు 26 : నాగార్జునసాగర్ జలాలను సాగు, తాగునీటి అవసరాలకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేరేడుచర్లలో బుధవారం నిర్వహించిన రైతు మహాధర్నాకు గరిడేపల్లి మండల బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో తరలివెళ్లారు. సాగునీరు అందక రైతు లు పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం వెంటనే స్పందించి సాగర్ జలాలను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు గుగులోతు కృష్ణ నాయక్, మాశెట్టి శ్రీహరి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ, మాజీ వైస్ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ వీరం రెడ్డి శంబిరెడ్డి, కర్నాటి నాగిరెడ్డి,గుగులోతు హేమ్లా నాయక్, కిత రామారావు, పెండెం వీరయ్యగౌడ్, గాలి రామకృష్ణ, ధనయ్యగౌడ్, పోలంపల్లి ఆనంద్ బాబు, సర్పంచులు బచ్చలకూరి శ్రీను బొలిశెట్టి సుధీర్ బోల్లెపల్లి రామనాథం మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.