23-10-2025 12:00:00 AM
భోలక్‌పూర్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బింగి నవీన్
ముషీరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునిత విజయం సాధించడం కాయమని భోలక్‌పూర్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయ కుడు బింగి నవీన్ అన్నారు. ఈ మేరకు బుధవారం బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునితకు మద్దతుగా భోలక్ పూర్ నుంచి బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు జూబ్లీహిల్స్‌లోని షేక్ పేటకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. అనంతరం బింగి నవీన్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజల సంక్షేమ, నగర అభివృ ద్ధికి ఎంతో కృషిచేసిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ను గెలిపించి అభివృద్ధికి నాందిపలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ భోలక్‌పూర్ డివిజన్ అద్యక్షుడు వై.శ్రీనివాస్ రావు, బీసీ సెల్ డివిజన్ అధ్యక్షుడు ఉమాకాంత్, డివిజన్ ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, నాయకులు ప్రవీణ్, అజయ్, పాషా, రవళి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.