23-10-2025 11:30:21 AM
భారత్-ఆస్ట్రేలియా(India vs Australia) జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ లో కుదురుగా ఆగుతున్న రోహిత్ శర్మ(73) ఔట్(Rohit Sharma out) అయ్యాడు. విచెల్ స్టార్క్ వేసిన షార్ట్ బంతిని ఆడబోయి హేజిల్ వుడ్ చేతికి రోహిత్ క్యాచ్ ఇచ్చాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్ తో 118 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 135 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 31 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్(56), అక్షర్ పటేల్ (2) నిలకడగా ఆడుతున్నారు.