13-11-2025 10:36:48 PM
కాకతీయ యూనివర్సిటీ (విజయక్రాంతి): బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుడు గండ్రకోట రాకేష్ యాదవ్‌ను గురువారం రోజున న్యూశాయంపేటలోని వారి స్వగృహంలో శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్, గులాబీ శ్రేణులు పరామర్శించారు. ఈ సందర్భంగా రాకేష్‌కు, వారి కుటుంబసభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రశ్నించే పౌరసమాజం, యువతపై అక్రమ కేసులు నమోదు చేయడం, పోలీసులతో కొట్టించడం ఏంటని విమర్శించారు.
సీపీని కలిసిన వినతిపత్రం
అనంతరం భారత రాష్ట్ర సమితి పార్టీ విద్యార్థి విభాగం ప్రతినిధులపై గత రెండు సంవత్సరాల కాలంలో అయిన కేసుల వివరాలను తెలుపుతూ... వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారిని కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారిపై మోపిన అక్రమ కేసులపై విచారణ జరపాలని కోరారు. వినతిపత్రం అందజేశారు.