13-11-2025 10:34:36 PM
తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్..
ప్రతి వాహనదారునికి అతివేగం.. ప్రమాదకరం, మృత్యు ఘోష..
తుంగతుర్తి (విజయక్రాంతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాలు సంభవించి ఒక్క ప్రాణం కూడా పోవద్దు అనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆటో స్టాండ్ సెంటర్స్ వద్ద ఆటో డ్రైవర్స్, ప్రయాణికులకు రోడ్డు భద్రతపై ఎస్ఐ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబం రోడ్డున పడుతుంది అని చైతన్యపరిచారు. ఆటోవాలాలు పరిమితికి మించి ప్రయాణికులను రవాణా చేయవద్దని ప్రమాదాల బారిన పడవద్దు అని కోరారు. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు రైతులు ప్రయాణ సమయంలో వాహనాలను నెమ్మదిగా నడపాలని అన్నారు, కూలీలు గూడ్స్ వాహనాలపై ట్రాక్టర్స్, బొలెరోలలో కూలీలు ప్రయాణాలు చేయవద్దని, 18 సంవత్సరాల నిండని వారికి వాహనాలు ఇచ్చి ప్రమాదాలు జరిగినట్లయితే, తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ సురక్షితంగా గమ్యం చేరుకోవాలని సూచించారు.