calender_icon.png 6 July, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య

06-07-2025 12:08:36 AM

-గొంతు కోసి, బాత్రూంలో పడేసి..

- కోరుట్లలో విషాద ఘటన

జగిత్యాల, జూలై 5 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల ని యోజకవర్గ కేంద్రంలో ఐదేళ్ల చిన్నా రి శనివారం రాత్రి దారుణ హత్యకు గురైంది. కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్ ప్రాంతంలో హితీక్ష(5) శనివారం రాత్రి కనిపించకపోవడం తో తల్లిదండ్రులు పోలీసులను సం ప్రదించారు.

పోలీసులు స్థానికంగా వెతకగా చిన్నారి ఇంటి సమీపంలోని ఓ ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో శివమై కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తి చిన్నారి మెడపై కత్తితో కోసి చంపేసినట్టు తెలిసింది. అయితే బాలిక మృతదేహం దొరికిన ఇంటి యజామాని పరారైనట్టు తెలిసింది. ఘటన స్థలానికి మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కోరుట్ల సీఐ సురేష్ బాబు చేరుకుని వివరా లు సేకరించారు. చిన్నారి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.