calender_icon.png 6 July, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాణిజ్య కేంద్రాల్లో రోజుకు 10 గంటల పని

06-07-2025 12:07:23 AM

అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): వాణిజ్య కేంద్రాల్లో రోజుకు 10 గంటల వరకు పనిచేసేందుకు అనుమతిని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని తెలంగాణ ప్రభు త్వం సవరించింది. వారంతో పని వేళలు 48 గంటలు మించరాదని స్పష్టం చేసింది.

పరిమితి దాటితే ఓటీ వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా పని వేళలు సవరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రోజులో 6 గంటల్లో కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాలని, విశ్రాంతితో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.