calender_icon.png 9 December, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ దారుణ హత్య

09-12-2025 12:57:21 AM

  1. ప్రియుడే హంతకుడు
  2. నిర్మల్ జిల్లా బైంసాలో ఘటన

బైంసా, డిసెంబర్ 7 (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లా బైంసాలోని టీకొట్టులో మహిళ దారుణ హత్యకు గురైంది. పులే నగరకు చెందిన అశ్విని (35), సంతోష్ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా అశ్విని గత నాలుగే ళ్లుగా భర్తతో దూరంగా ఉంటుంది. గత ఆరు నెలల క్రితం స్థానికుడైన నగేష్ అనే వ్యక్తితో అశ్విని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. ఇద్దరు కలిసి సంతోషిమాత నగర్‌లో టీ కొట్టు నడుపుతున్నారు.

అయితే అశ్విని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నదని భావించిన నగేష్.. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో టీ కొట్టిలో ఆమెతో గొడవపడి, రాడుతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోలీసులు అక్కడికి చేరుకొని నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్‌ఐ గోపీనాథ్ తెలిపారు.