09-12-2025 01:00:32 AM
మేడ్చల్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): మే డ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యా డు. అందరూ చూస్తుండగానే గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి కిరాతకంగా హతమార్చారు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటరత్నం (46) అనే రౌడీషీటర్ స్కూటీపై వెళ్తుండగా.. ఆటో, బైకు మీద వెంబడించిన ఆరుగురు సాకేత్ కాలనీ పోస్టర్ బిల్లా బాంగ్ స్కూలు సమీపం లో దాడికి పాల్పడ్డారు.
విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి, చివరగా కాల్పులు జరిపి పరారయ్యారు. ఆటోలో నలుగురు, బైకు మీద ఇద్దరూ పరారయ్యారు. కిరాతకంగా కత్తులతో దాడి చేయగా తల, మెడ, పొట్ట భాగాల్లో గాయాలై అక్కడికక్కడే మరణించాడు. స్థానికు ల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వెంకటరత్నంపై ధూల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉం ది. జంట హత్యల కేసులో వెంకటరత్నం నిందితుడిగా ఉన్నాడు.
వెంకటరత్నం రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. హత్యకు వ్యాపా ర ఆర్థిక లావాదేవీలే కారణమా? ఇం కా ఏమైనా వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలతో విచారణ చేస్తున్నామని మల్కాజిగిరి డిసిపి శ్రీధర్ తెలిపారు. ఘటన స్థలానికి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడి ఘటనలో ఆరుగురు పాల్గొ న్నప్పటికీ మరికొంతమంది పాత్ర ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.