08-07-2025 02:59:11 PM
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ వన్ టౌన్ పోలీసులు సోమవారం రాత్రి దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ యువకుడు, ఇద్దరు మహిళలని అదుపులో తీసుకొని విచారించారు. గత కొన్ని రోజులుగా జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డు కలెక్టర్ కార్యాలయం వెనకవైపు ఓ ఇంటిని అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నడిపిస్తున్నారు. పూర్తి సమాచారంతో వన్ టౌన్ సిఐ ఎ మిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా మెరుపు దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి వీరిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు.