calender_icon.png 8 July, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే పురోగతి : ఎంఈఓ రాములు నాయక్

08-07-2025 03:28:59 PM

నూతనకల్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ఆయా పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులే భాగస్వామ్యమని ఎంఈఓ రాములు నాయక్ అన్నారు మంగళవారం మండల మండల పరిధిలోని  పెద నేమిల, లింగంపల్లి, మిర్యాల, మాచనపల్లి తదితర పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాములు నాయక్ మాట్లాడుతూ... ప్రతి నెలలో ఒకరోజు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల పురోగతి పాఠశాలల మౌలిక వసతులు విద్యార్థుల సామర్ధ్యాలు విద్యార్థుల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని ఆయన సూచించారు.