08-07-2025 03:34:26 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) పర్యటనకు వస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి(CM Advisor Vem Narender Reddy) సోమ్లా తండాలో హెలిపాడ్ వద్దకు కారులో వెళ్తుండగా ఒక్కసారిగా పొగలు వచ్చాయి. వెంటనే కారు డ్రైవర్ కారును నిలిపివేయగా, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలు రేగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనతో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉలిక్కిపడ్డారు. ఏలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ఊపిరిపించుకున్నారు. ఘటనకు కారణాలను విశ్లేషిస్తున్నారు.