calender_icon.png 8 July, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్సంటేజ్‌ల కోసమే పాకులాడుతుండ్రు

08-07-2025 03:13:03 PM

పాలమూరు ఎత్తిపోతల పథకంలో పనులు ఎందుకు చేయట్లే 

హరీష్ రావును విమర్శించే స్థాయి ఎమ్మెల్యే జిఎంఆర్ కు లేదు 

ఎమ్మెల్యే జిఎంఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పర్సంటేజ్‌ల కోసం పాకులాడే పరిస్థితి కాంగ్రెస్ నేతల వంతు అయ్యిందని దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Former MLA Ala Venkateshwar Reddy) విమర్శించారు. ఒకే ఒక్కసారి తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచి ఇంకా నాకేం పర్వా అనుకుంటున్నారని, దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమ కోసమే హరీష్ రావు ఎంతో కృషి చేశారని, తక్కువ మెజారిటీతో గెలిచి విర్రవీగడం ఎంతవరకు సమంజసంమన్నారు.

పాలమూరు రంగారెడ్డి పథకంకి సంబంధించి 90% పనులు పూర్తయినప్పటికీ పది శాతం పనులు ఎందుకు చేయడం లేదని విమర్శించారు. దేవరకద్ర నియోజకవర్గంలోని కరువైన ప్రాజెక్టులో కూడా ఇలాంటి పనులు చేయకుండా మాయమాటలు చెబుతూ పర్సంటేజీల కోసం ప్రయత్నాలు చేయడం తప్ప మరి ఏ పని చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మాట్లాడితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లను కేవలం విమర్శించడం పనిగా పెట్టుకున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఎంత చెప్పినా కూడా మంచి చేయకుండా కేవలం ప్రజలను మోసం చేసే మాటలు మాట్లాడుతూ కాలం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఓ మంత్రి సభలో మీరు బాగున్నారా అని అడిగితే ప్రజలు మేము బాగాలేమని చెప్పడం మీ పరిపాలనకు నిదర్శనం అన్నారు. ప్రజలే బాగాలేమని చెప్తుంటే ప్రజాపాలనం ప్రచారం చేసుకోవడం మీ పనితనానికి నిదర్శనం అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా చెప్పుకుంటూ జిఎంఆర్ వరగబెట్టింది ఏంటో చెప్పాలని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎంతో మంచి చేసిందని ప్రజల గుండెల్లో చేసిన మంచి పదిలంగా ఉందని తెలిపారు. ఇలాంటి మాటలు మాట్లాడి కాలం గడిపితే ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు.