08-07-2025 03:21:39 PM
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాప్ కార్యాలయంలో మంగళవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తో పాటు పలువురు కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైయస్సార్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.