08-07-2025 02:57:12 PM
జనగామ,(విజయక్రాంతి): మద్యం మత్తులో భార్యలపై గొడ్డలితో దాడి చేయడానికి ప్రయత్నించిన భర్తను ఇద్దరు భార్యలు కలిసి హత్య చేసిన ఘటన జనగామ జిల్లా(Jangaon District) లింగాల గణపురం మండలం ఏనె బావి శివారు పిట్టలోని గూడెంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం గత మే నెల 18 న అత్తను హత్య చేసి జైలు కెళ్ళి విడుదలై వచ్చిన కే. కనకయ్య (30 ) సోమవారం రాత్రి గ్రామానికి వచ్చి తల్లి గారి ఇంట్లో ఉంటున్న సొంత అక్క చెల్లెలు అయిన భార్యలు శిరీష, గౌరమ్మలపై గొడ్డలితో దాడి చేయడానికి యత్నించగా, వారిద్దరు కలిసి తిరగబడి అదే గొడ్డలితో నరికి చంపినట్లు సమాచారం. ఘటన పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.