calender_icon.png 8 July, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల గుండెల్లో వైయస్సార్ పదిలం

08-07-2025 03:03:40 PM

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

జడ్చర్ల: ప్రజల గుండెల్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎల్లప్పుడు పదిలంగా ఉంటారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ రెడ్డి మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి, జనహృదయ నాయకుడు డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి  ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమ కోసం పరితపించే వారిని కొనియాడారు. ఇప్పటికీ ఎప్పటికీ ప్రజలు వైఎస్ఆర్ ని మరువలేరని పేర్కొన్నారు.  ఆయన ప్రవేశపెట్టిన ప్రజాప్రయోజన పథకాలు కోట్లాది మందికి మేలు చేశాయనీ, ప్రతి నాయకుడు వైయస్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.