calender_icon.png 18 December, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఎస్పి కోనరావుపేట మండల అధ్యక్షుడు

18-12-2025 08:17:22 PM

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): కోనరావుపేట మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పికి భారీ షాక్ తగిలింది. బిఎస్పి మండల అధ్యక్షుడు కుమ్మరి దేవదాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం వేములవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దేవదాస్‌కు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడనై పార్టీలో చేరినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని ఆయన పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.