18-12-2025 08:21:57 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్, మండల నాయకులు ఈది గణేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.