06-11-2025 04:48:56 PM
మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం..
మల్యాల (విజయక్రాంతి): మల్యాల తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రంలో ఒకటైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో అర్జిత సేవలు ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి ధరలను పెంచవద్దని ఈ దేవస్థానానికి సామాన్యుల భక్తులు వస్తారు. వారి మీద అధిక భారం మోపద్దని భక్తులకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దు. మొదటగా భక్తులకు కొండగట్టులో మూత్రశాలలు, వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. కోనేటిలో కనీసం వారానికి ఒకసారైనా నీటిని విడుదల చేసే ప్రయత్నం చేయాలి.
కొండగట్టు అభివృద్ధికి మీరు చేసే ప్రతి పనికి మేము సహకరిస్తున్నాం. కాకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ పని చేసిన ఉపేక్షించలేదని ధర నిర్ణయాన్ని వెంటనే ఉపసహరించు కోవాలని లేకపోతే బిజెపి పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని కొండగట్టు సూపర్డెంట్ సునీల్ రావు మరియు హరినాథ్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గాజులు మల్లేశం. మాజీ ఎంపీటీసీ సంఘని రవి. బొబ్బిలి వెంకటస్వామి యాదవ్ .బొట్ల ప్రసాద్. కోన శ్రీనివాస్. మల్లేశం యాదవ్. గౌతమ్. బండారి రాజు. నీలం రవి. నక్కా ఆనందం. రాఘవేంద్ర. జిల్లాల రమేష్. బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.