calender_icon.png 6 November, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలి

06-11-2025 05:51:24 PM

వలిగొండ (విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీస మౌలిక వసతులు కల్పించాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా సమితి పిలుపుమేరకు గురువారం వలిగొండ, వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సదుపాయం ఉన్న ఆసుపత్రిలో ఇద్దరు మెడికల్ డాక్టర్ కు బదులు ఒకే డాక్టర్ అది కూడా దాదాపు 8 నెలలుగా డిప్యూటేషన్ పైన విధులు కొనసాగిస్తున్నారని అన్నారు.

వాచ్మెన్, అటెండర్ లేక ఇబ్బందులు పడవలసి వస్తుందని వెంటనే పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని అన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. అన్ని రకాల మందులు అందించాలని  కుక్క, కోతి ,పాము కాటు  వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని కోరుతూ, మెరుగైన డయాగ్నిస్ట్  పరికరాలను, బెడ్స్ పెంచాలని డిమాండ్ చేశారు.