06-11-2025 05:49:30 PM
వలిగొండ (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని వలిగొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం రాజకీయ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీసీల ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా కలసి రావాలని వారు డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం తాడోపేడో తేల్చుకోవడానికి బీసీ సోదరులు అవసరమైతే త్యాగాలకు సిద్ధపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిని యాదగిరి, సిర్పంగి స్వామి, ఎల్లంకి మహేష్ తదితరులు పాల్గొన్నారు.