calender_icon.png 6 November, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపన్న హస్తం అందజేత

06-11-2025 06:07:50 PM

జన్నారం (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లికి చెందిన గురిజాల సుమతికి తన తోటి పదవ తరగతి బాల్య మిత్రులు గురువారం ఆపన్న హస్తం అందించారు. సుమతి భర్త గురిజాల రవి వారం రోజుల కిందట అనారోగ్యంతో మృతిచెందారు. వీరికి ఆరవ తరగతి చదువుతున్న కూతురు ఉంది. పదో తరగతి స్నేహితులందరూ ఏర్పర్చుకున్న ‘వసుదైక కుటుంబం ఎస్ఎస్సి 2005 జేవీఎన్ఆర్ఏం జెడ్పిఎస్ఎస్ ద్వారక సేవా ట్రస్ట్’ ద్వారా రూ. 40 వేలు అందజేశారు. ఆపద సమయంలో భరోసానిచ్చిన బాల్యమిత్రులను గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు.