calender_icon.png 6 November, 2025 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ధర్నా

06-11-2025 06:10:28 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సింగరేణి వ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం ఏరియాలోని అన్ని గనులు డిపార్ట్ మెంట్లపై ఏఐటియుసి నాయకులు ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయ ణ, బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమనాధుని సుదర్శన్ లు మాట్లాడారు.

మెడికల్ బోర్డు నిర్వహణలో కాలయాపన జరిగిందని వెంటనే బోర్డు ఏర్పాటు చేసి పాత పద్ధతిలో ఇన్వాల్యుడేషన్ చేయాలని, మెడికల్ ఫిట్ అయి ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న డిపెండెంట్ లకు నియామక పత్రాలు వెంటనే అందజేయా లని వారు డిమాండ్ చేశారు. కార్మికుల స్వంత ఇంటి సాకారం అమలు చేయాలని , పెర్క్స్ పై విధిస్తున్న ఐటీనీ కోల్ ఇండియా మాదిరిగా యాజమాన్యం భరించాలని, మారుపేర్లతో ఉద్యోగాలు చేస్తున్న వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని, అకారణంగా డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ నిరాకరించిన ఉద్యోగుల పిల్లలను ఉద్యోగా నికి అనుమతించాలని కోరారు.

డిస్మిస్డ్ ఉద్యోగులకు మళ్లీ ఒక అవకాశం కల్పించా లని, సింగరేణి యాజమాన్యం ఇచ్చిన 150 మస్టర్ల నిబంధన సర్కులర్లను వెంటనే ఉపసం హరించాలని, గనులలో మ్యాన్ పవర్ లేదనే సాకుతో కార్మికులపై పనిభారం పెంచవద్దన్నారు, డివిజన్లోని శ్రావణపల్లి ఓసి,  కేకే6 గనులను  టెండర్ ప్రక్రియ ద్వారా సింగరేణి చేపట్టాలని, దీర్ఘ కాలిక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే జనవరి నెలలో సమ్మె నోటీస్ ఇస్తామని అందర్నీ కలుపుకు పోయి సమ్మె చేసైనా డిమాండ్లు సాధిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ సోమిశెట్టి రాజేశం, జాయింట్ సెక్రెటరీ కంది శ్రీనివాస్,ఏరియా నాయకులు బానయ్య, టేకుమట్ల తిరుపతి, ఆంటోని దినేష్, ఎగేటి రాజేశ్వరరావు,  ముల్కల వెంకటేశ్వర్లు, కుమారస్వామి, సాదినేని ప్రభాకర్, గాండ్ల సంపత్, ప్రభాకర్ శర్మలు పాల్గొన్నారు.