calender_icon.png 6 November, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదాన శిబిరం

06-11-2025 05:57:33 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీ బాయి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని కాలేజ్ రోడ్డు, లక్ష్మీనగర్ బ్రాంచీల ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏజిఎం అరవింద్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ అయూబ్, సంజీవ్, జోనల్ పీటీ రాజేందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.