06-11-2025 06:05:39 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో ద్వారా గురువారం ప్రయాగ్ రాజ్, అయోధ్య, కాశీ యాత్ర బస్సు సర్వీసులు నిర్మల్ డిఎఫ్ పండరీ ప్రారంభించారు. అయోధ్య, కాశీకి నిర్మల్ డిపో నుండి వెళ్లడం ఇది రెండవ బస్సు. అయోధ్య వెళ్లే భక్తులు ఆదరించడం వల్ల రెండవ బస్సు నడపడం జరిగిందని ఇంకా చాలామంది భక్తులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని మరొక బస్సు నడపడానికి తేదీ నిర్ణహిస్తామని డిపో మేనేజర్ కే పండరి తెలిపారు.
అలాగే రేపు అరుణాచలం, తిరుపతి బస్సు వెళుతుందని ఆయన తెలిపారు. నిర్మల్ డిపో నుండి వివిధ దేవాలయాలకు యాత్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ప్రయాణికులు ఆదరించాలని ఆయన కోరారు. త్వరలో పండరి పూర్, తుల్జాపూర్, కొలహాపూర్, భద్రాచలం, సింహచలం, అన్నవరం రామేశ్వరం, శ్రీరంగం,కంచీపురం, అరుణాచలం, శబరిమలై నడపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ ని ఆధారించాలని ఆయన కోరారు.