06-11-2025 05:54:52 PM
నిర్మల్ (విజయక్రాంతి): అడెల్లి మహా పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. సారంగాపూర్ మండలంలోని సుప్రసిద్ధ అడెల్లి గ్రామంలో గల శ్రీ మహా పోచమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం నిత్యవిధి చండి హోమం, మూలమంత్ర హోమము ప్రతిష్టాంగ హోమాలు, సామూహిక కుంకుమార్చన జరిపారు.
మధ్యాహ్నం డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు, నిర్మల్ ఏఎంసీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,వివిధ మండల పార్టీ అధ్యక్షులు, వివిధ దేవాలయాల చైర్మన్ లు, ధర్మకర్తలు, మాజీ ఏఎంసీ చైర్మన్ లు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ లు, మాజీ మునిసిపల్ చైర్మన్ లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, మాజీ జెడ్పీటీసీ లు, మాజీ ఎంపీపీ లు, వీడీసీ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ లోని అన్ని విభాగాలు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.