06-11-2025 06:13:22 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రజలు కార్మికులు వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది సిపిఐ పార్టీ త్వరలో బస్సు జాతర నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి బాసర నుండి నిర్మల్ వరకు ఈ బస్సు జాతరలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని ఇందులో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనేలా పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ శివాజీ గోపి మోహన్ కైలాస్ తదితరులు పాల్గొన్నారు.