calender_icon.png 6 November, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్వాసితులకు దుకాణాలు నిర్మించి ఇవ్వాలి

06-11-2025 06:03:31 PM

సబ్ కలెక్టర్ మనోజ్ కు సీపీఐ వినతి..

బెల్లంపల్లి అర్బన్: రోడ్డు విస్తరణలో ఉపాధి కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఐ బెల్లంపల్లి పట్టణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ వినతిపత్రం అందచేశారు. బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ నుండి కూరగాయల మార్కెట్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం వ్యాపారులు జీవనోపాధిని కోల్పోయారని సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి వాపోయారు. పట్టణ అభివృద్ధి పనులకు భారత పార్టీ బెల్లంపల్లి పట్టణ సమితి ఆహ్వానిస్తుందనీ, ఈ రోడ్డు విస్తరణలో వ్యాపారులు, చిరు వ్యాపారులు జీవనోపాధి కోసం దుకాణాలు నిర్మించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.

దుకాణాలు కోల్పోయి ఆర్థికంగా నష్టపోయాన్నారు. అందుకే మున్సిపల్ అధికారులే వ్యాపార సముదాయాలను నిర్మించి అందించాలన్నారు. గతంలో కూడా రోడ్డు విస్తరణలో ఉపాధి కోల్పోయిన వారి పరిస్థితి దయనీయమైందనీ  ప్రస్తుతం ఉపాధి కోల్పోయిన వారందరి సమాచారాన్ని సేకరించి పారదర్శకంగా ఎటువంటి అవినీతికి చోటు లేకుండా వారు ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వమే దుకాణాల షెడ్లను నిర్మించి ఇవ్వాలి పునరుద్ధాటించారు. అదేవిధందా  పట్టణంలో ఫార్కింగ్  సమస్య ను పరిష్కరించాల కోరారు. వాహనాల కోసం పార్కింగ్ స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజం, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు బొల్లం సోనీ పాల్గొన్నారు.