calender_icon.png 24 May, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్

24-05-2025 12:00:00 AM

బూర్గంపాడు,మే23 (విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో నూతన భవనం నిర్మాణ పనులు జేసిబి తో చేస్తున్న క్రమంలో మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ పగిలింది. దీంతో త్రాగునీరు వృధాగా పోతుం ది. త్రాగునీటికి ఇబ్బంది కలగకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మ రమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

శాఖల మధ్య సమన్వయ లోపం సమస్యకు కారణమైంది. అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో మిషన్ భగీరథ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది, టెలిఫోన్ శాఖ సిబ్బంది పర్యవేక్షిస్తే ఇలాంటి సమస్య ఉత్పన్నం అయ్యేది కాదని మండల వాసు లు అంటున్నారు.