విద్యార్థులకు మజ్జిగ పంపిణీ
19-03-2026 12:00 AM
బెజ్జూర్ మార్చి 18 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో 10వ తరగతి విద్యార్థులకు మాజీ జెడ్పిటిసి పంద్రం పుష్పలత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న క్రమం లో ఆకలి దప్పికను తీర్చే ఉద్దేశంతో సేవా భావంతో విద్యార్థుల కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయ డం అభినందనీయమని సర్పంచ్ పద్మ, సోయం చిన్నయ్య,ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్ అన్నారు.
పదవి ఉన్న లేకున్నా ప్రజాసేవలో ఉండడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు మాజీ జెడ్పిటిసి పందరం పుష్పలతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సుగుణ, లింగయ్య, నాయకులు లక్ష్మి, శంకర్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.




