లిఫ్ట్‌ఇచ్చి వ్యక్తి గొంతు కోసిన వాహనదారుడు
జిల్లాలో కలకలం రేపిన ఘటన
ఆదిలాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): ద్విచక్ర వాహనదారుడు ఓ వ్యక్తిని లిఫ్ట్ ఎక్కించుకొని కొద్ది దూరం వెళ్ళాక నిర్మానుష్యమైన ప్రాంతంలో బండరాయితో తలపై మోదీ, గొంతు కోసి డబ్బులతో ఉడాయించిన ఘట న జిల్లాలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యయి.
లాండసాంగి గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి గతరాత్రి ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్‌గూడ గ్రా మానికి వెళ్లేందుకు ఆదిలాబాద్ పట్టణంలోని సాత్నాల బస్టాండ్ వద్ద ఆటో కోసం ఎదురుచూస్తూడు. ఈ క్రమంలోని అటుగా వెళుతు న్నా ఓ వాహనదారుడిని లిఫ్ట్ అడిగాడు. సదరు వాహనదా రుడు ఆయన్ని బైక్ పై ఎక్కించున్నాడు. కొంత దూరం వెళ్ళక బం గారిగూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతం లో మూత్ర విసర్జన కోసం బైక్‌ను ఆపాడు.
దీంతో ఇద్ద రు బైక్ దిగిన వెంటనే వాహనదారుడు అశోక్ తలపై బండరాయితో మోదీ, కత్తితో గొంతు కోసి ఆయన వద్ద ఉన్న 13 వందల నగదు, సెల్ ఫోన్‌ను దొంగలించి, ఉడయించాడు. రోడ్డుపై వెళ్తున్న కొందరు చూసి వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. తీవ్ర గాయాలతో ఉన్న క్షతగాత్రుని రిమ్స్‌కు తరలించారు. వాహనంపై ఎక్కించుకొని వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో, సీసీఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆరా తీస్తున్నారు.




