25న క్యాబినెట్ భేటీ
21-07-2024 12:08 AM
బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనున్న మంత్రివర్గం
అదే రోజు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 25వ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగనున్నది. ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న మంత్రవర్గం 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జారీచేసిన సర్క్యులర్‌లో తెలిపారు. అదేరోజు అసెంబ్లీలో డిఫ్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ రూ.2.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా.






