25-04-2025 01:47:55 AM
ముగ్గురు అరెస్టు.. నలుగురు పరారీ నిందితుల్లో ఏఆర్ కానిస్టేబుల్
చేవెళ్ల, ఏప్రిల్ 24:ఫామ్ హౌస్ ను కూల్చివేసి దాని స్క్రాప్ అమ్ముతామని పిలిచి... రూ.23 లక్షలు దోచుకున్న ఘటన మొయినాబాద్ పీఎస్ పరిధిలో కలకలం రేపింది. సీఐ పవన్ కుమార్ రెడ్డి వివరాల ప్రకారం... హైదరాబాద్ కు చెందిన ఇమ్రాన్, ఉమర్ ఫరూక్ స్క్రాప్ వ్యాపారం చేస్తుంటారు. వీరికి ఉత్తర ప్రదేశ్ కు చెందిన అజయ్ తో పరిచయం ఉంది. స్క్రాప్ వ్యాపారులు లక్షల్లో అమౌంట్ ఇచ్చి... కూల్చివేతకు సిద్ధంగా ఉన్న ఇండ్లు, ఫామ్ హౌస్ లను తీసుకుంటుంటారు.
ఇది ఆసరాగా చేసుకున్న అజయ్ వీరి నుంచి ఎలాగైనా డ బ్బులు కాజేయాలని పన్నాగం పన్నాడు. వెంటనే అతనికి పరిచయం ఉన్న ముబిన్, నబీ, ఇమ్రాన్ లకు ఈ విషయం చె ప్పాడు. వచ్చిన డబ్బులు అందరం పంచుకుందామని, స్థానికుల సహకారం, తెలిసిన పోలీసుల సపోర్ట్ ఉంటే పని ఈజీ అవుతుందని చెప్పాడు. ఇందులో ముబిన్ గతంలో ఏడాది పాటు మొయినాబాద్ మండలం కుత్బుద్దీన్ గూడ లో ఓ ఫా మ్ హౌస్ ఓనర్ దగ్గర డ్రైవర్ గా పనిచేశాడు.
అతనికి ఫామ్ హౌస్లో వాచ్ మన్ గా పనిచేసే గ్రామానికి చెందిన రాంచందర్ పరిచయం ఉండడంతో అతనికి విషయం చెప్పాడు. దీంతో రాంచందర్.. గ్రామానికే చెందిన మసూద్ తో పాటు సైబరాబాద్ కమిషనరేట్ లో ఆర్ కానిస్టేబుల్ గా పనిచేసే అదే గ్రామానికి చెందిన శేఖర్ కు విషయం చెప్పగా.. టీమ్ లో కలిసేందుకు ఒప్పుకున్నారు.
ప్లాన్ ప్రకారం అజయ్ స్క్రాప్ వ్యాపారులకు ఫామ్ హౌస్ కూలగొట్టేందుకు సిద్దంగా ఉందని, దాని స్క్రాప్ అమ్ముతారని చెప్పగా.. ఇమ్రాన్, ఉమ ర్ ఫరూక్ కు మరో వ్యక్తి సోహైల్ ను తీసుకొని రూ. 23 లక్ష ల నగదుతో బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు వారు చెప్పిన ప్లేస్ కు చేరుకున్నారు.
అక్కడ అజయ్తో పాటు ము బిన్, నబీ, ఇమ్రాన్, రాంచందర్, శేఖర్ (ఏఆర్ కానిస్టేబుల్, సైబరాబాద్) మరో వ్యక్తి మసూద్ వారిపై దాడి చేసి నగదు బ్యాగును లాక్కొని బైక్, కారులో పారిపోయారు. తర్వాత బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు.
బైక్ నెంబర్ తో దొరికిపోయారు..
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. కుత్బుద్దీన్ గ్రామానికి వెళ్లి ఘటన జరిగిన ప్రదేశంతో పాటు చుట్టు పక్కల సీసీ కెమెరాలు చెక్ చేయగా.. ఓ బైక్ కనిపించింది. దాని నెంబర్ అధారంగా ట్రేస్ చేయగా.. బుధవారం మొయినాబాద్ మం డల పరిధిలోనే ఆ బైక్ దొరికింది. పట్టుకొని చెక్ చేయగా.. కుత్బుద్దీన్ గూడకు చెందిన హరీశ్ ది గా తేలింది.
అతన్ని అడగగా... మంగళవారం కానిస్టేబుల్ శేఖర్ తీసుకెళ్లినట్లు చెప్పా డు. దీంతో వెంటనే శేఖర్ తో పాటు క్రైంలో పాల్గొన్న గ్రామానికి చెందిన రాంచందర్, మసూద్ లను అరెస్టు చేసి జ్యుడీషి యల్ కస్టడీకి తరలించారు. మిగిలిన నిందితులు అజయ్, ముబిన్, నబీ మరియు ఇమ్రాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.