12-12-2025 05:47:03 PM
ధనపురి సాగర్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): హమ్ స్వచ్ఛంద సంస్థ, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో,నేను తప్పక ఓటు వేస్తాను, మీరు కూడ ఓటు వేయండి! కాని (డబ్బుకు ప్రలోబపడి కాదు) మీ ఓటే ఒక ప్రశ్నించే గొంతుగా కావాలి! అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్ ను శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోనీ శ్రీ వాణి డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఆ వాల్ పోస్టర్ ను గర్రెపల్లిలో పరిసర ప్రాంతాలలో అంటించి అక్కడి ప్రజలకు ఓటు విలువను తెలియజేయడమైనది సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ పటేల్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని దానిని ప్రతి ఒక్క ఓటర్ వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీతి నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్, ప్రిన్సిపల్ కమలాకర్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.