calender_icon.png 9 December, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు నిషేధం

09-12-2025 12:00:00 AM

నిజామాబాద్, డిసెంబర్ 8 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని మొదటి విడతలో ఎన్నికలు జరుగనున్న బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల పరిధిలో 9వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని, ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.

44 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో పై మండలాలలో ఎవరు కూడా బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదని అన్నారు. ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి, ఎం.సి.సి బృం దాలు, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. కాగా,  9వ తేదీ మంగళవారం సాయంత్రం 5.00 నుండి ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో మద్యం షాపులను, కల్లు దుకాణాలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు.

మొదటి విడత పోలింగ్ నేపధ్యంలో 11న వేతనంతో కూడిన సెలవు 

నిజామాబాద్, డిసెంబర్ 8 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి విడతగా ఈ నెల 11న పోలింగ్ జరుగనున్న మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వేతనం తో కూడిన సెలవు దినంగా ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి దశ ఎన్నికలు నిర్వహించనున్న బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల్లో అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, పరిశ్రమలకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ప్రైవేట్ వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు వారి వద్ద పని చేసే ఉద్యోగులు, సిబ్బందికి ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన వెసులుబాటు కల్పిస్తూ అనుమతిన్చాలన్నారు. కాగా, ఎన్ని కల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రా లుగా వినియోగిస్తున్న విద్యా సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు  10, 11వ తేదీలలో రెండు రోజుల పాటు సెలవు దినాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.