09-12-2025 12:00:00 AM
ఎల్లారెడ్డి, డిసెంబర్ 8 (విజయ క్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం మొదలైంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మండలంలోనీ 31 గ్రామపంచాయతీలలో నాలుగు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 27 గ్రామపంచాయతీలో సర్పంచ్ స్థానానికి సుమారు 88 మంది నామినేషన్ వేశారు. 377 మంది వార్డ్ మెంబర్ స్థానానికి నామినేషన్ వేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో తాహెరా బేగం తెలిపారు.
సోమవారం ఉదయం నుంచి అభ్యర్థులకు గుర్తింపులు రావడంతో ప్రింటింగ్ ప్రెస్ ల వద్ద సర్పంచ్ వార్డ్ మెంబర్ల అభ్యర్థులు కుప్పలు కుప్పలుగా తమ గుర్తులు గుర్తింపు పత్రాలను ప్రింటింగ్ ప్రెస్ వద్ద తీసుకొని, గ్రామాల్లోకి,వెళ్లి, ఇంటింటికి తమ గుర్తింపును చూపిస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం మొదలైంది.
రెండో విడత విడత ఎన్నికలు జరిగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట లింగంపేట, తాడ్వాయి సదాశివ నగర్ గాంధారి రామారెడ్డి రాజంపేట మండలాల్లో,ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపులు పూర్తి కావడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. పలువురు అభ్యర్థులు ముఖాముఖిగా తలపడుతున్నారు. కరపత్రాలు, వాల్ పోస్టర్లతో పనులు ప్రారంభించారు.
కొందరు తమకు కేటాయించిన గుర్తులతో పాటు తమ ఫొటోలు ఉండే విధంగా భారీ బ్యానర్లు సైతం రెడీ చేసి గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో, కాలనీల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.బరిలో నిలిచిన భవితవ్యం, ఓటర్ల చేతిలో,భద్రంగా ఉంది. గెలుపెవరిదోనోనని, ఆసక్తిగా కొనసాగిస్తున్నారు.
ఫసోషల్ మీడియాలో విస్తృత ప్రచారం..
పంచాయతీ అభ్యర్థులు సోషల్ మీడియాల్లో తమకు కేటాయించిన గుర్తులతో పాటు ఎన్నికల్లో తమను గెలిపిస్తే చేసే పనుల చిట్టాను చక్కర్లు కొట్టిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇప్పటికే ఆయా గ్రామాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకుంటున్న వాట్సాప్ గ్రూప్లను ఇందుకు వేదికగా మలచుకొని ఆన్లైన్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కొందరు రీల్స్ సైతం చేస్తూ పంచాయతీల్లో గెలుపు కోసం విభిన్న పంథా అనుసరిస్తుండడంతో పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది.
పట్టణాలు, నగరాల్లో,ఉన్న తమ పల్లె ప్రజలకు కూడా వాట్సాప్ ద్వారానే తమ గుర్తు, హామీలను పంపుతూ ఓట్లను అభ్యరిస్తూ నయా ట్రెండ్ సృష్టిస్తున్నారు. మరో ఐదు రోజులు మాత్ర మే సమయం ఉండడంతో ఊర్లలో ఉన్న తమ బంధుగణంతో పాటు స్నేహితులతో గెలుపు మంతనాలు చేస్తున్నారు. కులాలు, యూత్ అసోసియేషన్ల వారీగా హామీలు ఇస్తూ సర్పంచ్ పీఠంతో పాటు వార్డు స్థానా లు గెలుచుకునేందుకు యత్నిస్తున్నారు.
ఫగుర్తుల ప్రచారంపై స్పెషల్ ఫోకస్..
పంచాయతీ ఎన్నికల సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులను ప్రచారంలో స్పెషల్ ఫోకస్ చేయడంపై దృష్టి సారించారు. ఉంగరం, కత్తెర, ఫుట్బాల్, లేడీ పర్సు, టూత్ పేస్టు, చెత్తడబ్బా, నల్ల బోర్డు, బెండకాయ, బ్యాట్, తదితర గుర్తులను గుర్తుంచుకోవాలంటూ సర్పంచ్, వార్డు అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం అటు సోషల్ మీడియాలో ఇటు ప్రచారంలో హీట్ పుట్టిస్తోంది.
కరపత్రాలు, వాల్ పోస్టర్లు, బ్యానర్లతోని పల్లెల్లో సందడి ఉంది. తొలి దశ ఎన్నికలు జరిగే మూడు మండలాల్లో ఈ ఆన్లైన్ ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఎల్లారెడ్డి మండలంలోని బిక్కనూర్ శివాపూర్ గ్రామాలలో ప్రజలు పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతూ గ్రామాలలో గుర్తులు చూపిస్తూ ప్రజల వద్దకు నేరుగా వెళ్లి తమ గుర్తులు చూపిస్తూ తమకు ఓటు మద్దతు ఇవ్వాలని ప్రత్యేకంగా ఓటర్లను వేడుకుంటున్నారు.