09-12-2025 12:00:00 AM
ఉపాధ్యాయులపై చర్యలు
నిజాంసాగర్, డిసెంబర్8 (విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి ఆదివారం నాడు గొట్టం అజయ్ అనే విద్యార్థి మంజీరా నదిలో నీట మునిగి మరణించిన సంఘటనపై సాంఘిక సంక్షేమ జోనల్ అధికారి ప్రత్యూష సోమవారం నాడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అచ్చంపేట నందు విచారణ నిర్వహించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన గణపతికి ఏడు రోజుల్లోగా సంజాయిషీవ్వాలని నోటీసు జారీ చేశారు.
నిర్లక్ష్యం గా వ్యవహరించిన ఉపాధ్యాయుడు రవికాంత్ ను విధుల్లో నుంచి తొలగించినట్లు ఆమె తెలిపారు. విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా ఉన్న తాత్కాలిక ఉపాధ్యాయులు లక్ష్మయ్య, పీఈటి రాజు, వాచ్మెన్ కిషన్లపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట డిసీవశివరావు ఉన్నారు.