calender_icon.png 11 May, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ సిందూర్‌కు కాంగ్రెస్ వ్యతిరేకమనే ప్రచారం సరికాదు

10-05-2025 01:11:53 AM

కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి) : ఆపరేషన్ సిందూర్ సమయంలో కాంగ్రెస్ పార్టీని కొంత మంది డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆపరేషన్ సిందూర్ కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో ఉండే దూరదర్శన్ చానల్‌లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ప్రతాప్‌సింగ్ ఫోటోలతో ప్రసారం చేశారని, కాంగ్రెస్ పార్టీ పరువు నష్టం దావా వేసిందన్నారు.

శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు చరణ్‌కౌశిక్ యాదవ్, శ్రీకాంత్ యా దవ్‌తో కలిసి  ఎంపీ చామల మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్‌పై భారత్ మొదలు పెట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలను కాంగ్రెస్ ప్టా మద్దతు ఇస్తుందని, దేశ వ్యాప్తంగా త్రివిధ దళాలకు మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించామని తెలిపారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి త్రివిధ దళాలతో ర్యాలీ చేశారన్నారు.

పార్టీలకు అతీతంగా త్రివిధ దళాలు తీసుకునే నిర్ణయానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌లో  ఇద్దరు మహిళలు సోఫియా ఖురేషి, యువీక సింగ్ పాల్గొనడం దేశం గర్విస్తుందని తెలిపారు.  ఇప్పటికే పాకిస్తాన్‌తో మన దేశానికి మూడు సార్లు యుద్దం జరిగిందని, రెండు  సమయాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందన్నారు.