calender_icon.png 5 February, 2026 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెమ్‌కేర్ ఆధ్వర్యంలో వాకథాన్

05-02-2026 01:41:59 AM

క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం 

ఖమ్మం, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, ఖమ్మంలోని (ఆరోగ్య హాస్పిటల్) జెమ్‌కేర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో బుధవారం ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించేందుకు వాకథాన్ నిర్వహించారు. క్యాన్సర్ నివారణ, తొలిదశ గుర్తింపు, సమయానుకూల చికిత్స గురించి ప్రజలకు అవ గాహన కల్పించారు. ఈ వాకథాన్ ఉదయం 7 00 గంటలకు పెవిలియన్  గ్రౌండ్ నుండి ప్రారంభమై, గవర్నమెంట్ హాస్పిటల్, ఇల్లందు  క్రాస్ రోడ్ మీదుగా  జెమ్కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వద్ద ముగిసింది. వివిధ వయస్సుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, క్యాన్సర్ అవగాహనకు తమ మద్దతును తెలిపారు.

జెమ్కేర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుధాకర్ కొట్లపాటి మాట్లాడుతూ.. ఈ వాకథాన్ ప్రధాన లక్ష్యం ప్రజలకు క్యాన్సర్‌కు సంబంధించిన సాధారణ లక్షణాలు, ప్రమాదకర కారణాలు, తొలిదశలో స్క్రీనింగ్ ఎంత ముఖ్యమో వివరించినట్టు తెలిపారు. అనంతరం  జెమ్కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీని యర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నుక్కసాని సుబ్బారావు, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్ట ర్.హరీష్ రావూరి, ఆంకోపాథాలజిస్ట్ డాక్టర్ అమృతజిలు మాట్లాడుతూ.. జెమ్కేర్ క్యాన్స ర్ ఇన్స్టిట్యూట్లో ఒకే చోట సంపూర్ణ క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. ఇక్కడ 4డీ ట్రూ బీమ్ రేడియేషన్ థెరపీ వంటి ప్రపంచస్థాయి ఆధునిక సాంకేతికతతో పాటు, ఖచ్చితమైన నిర్ధారణకు ఉప యోగపడే అత్యాధునిక పెట్‌సీటీ స్కానర్ సౌకర్యం ఉందన్నారు.