calender_icon.png 27 January, 2026 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

27-01-2026 08:33:31 PM

భక్తులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరానికి ముఖ్య అతిథులుగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని, ఆపద సమయంలో రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడమే కాకుండా, ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ చేస్తున్న సేవలను అభినందనీయమని అన్నారు.

రెడ్ క్రాస్ సంస్థకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్రంలోనే ఉత్తమ హనుమకొండ రెడ్ క్రాస్ సేవలను, పాలకవర్గాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయ్ చందర్ రెడ్డి మాట్లాడుతూ... తమ పాలకవర్గ సహకారంతో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అగ్రంపాడులో ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఐదు రోజులపాటు భక్తులకు, ప్రజలకు వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

అనంతరం హనుమకొండ రెడ్ క్రాస్, ఎస్జెపి ఫౌండేషన్ సహకారంతో హెల్మెట్లు, వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా జ్యూట్ బ్యాగులను ఎమ్మెల్యే చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఇ.వి శ్రీనివాసరావు, సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, బిల్ల రమణ రెడ్డి, ఆర్డిఓ కే. నారాయణ, దేవస్థానం ఈవో నాగేశ్వరరావు, అగ్రంపాడు జాతర చైర్మన్ వంచ రంగారెడ్డి, ఏఎంసి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ గంగుల మహేందర్, అక్కంపేట సర్పంచ్ ముద్దం సాంబయ్య, రెడ్ క్రాస్ వైద్యులు డాక్టర్ జై. కిషన్ రావు, అధికారులు, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.