27-01-2026 08:36:54 PM
ఐక్యతతో పని చేస్తే గ్రామాల అభివృద్ధి సాధ్యం
పాపన్నపేట: పాపన్నపేట మండలం సర్పంచుల ఫోరం నూతన కార్యావర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు సమావేశమై మండల సర్పంచుల ఫోరాన్ని ఎన్నుకున్నారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులుగా అబ్లాపూర్ గ్రామ సర్పంచ్ నిరూడి వెంకటేశంను ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా విజయదుర్గ నాని(లక్ష్మీనగర్), వెంకయ్య(పొడిచనపల్లి), సాయిరెడ్డి(రామతీర్థం), జనరల్ సెక్రటరీగా పాశం సిద్ధిరాంరెడ్డి(గాంధారిపల్లి), కోశాధికారిగా నిమ్మనగారి సిద్దప్ప(లింగాయిపల్లి), జాయింట్ సెక్రటరీగా పాత్ లోత్ శంకర్(నర్సింగరావు తాండ) లను ఎన్నుకున్నారు.
అనిత, నాగరాజు, రాణమ్మ రమేష్ లను ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా ఏనుకున్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవింద్ నాయక్ పేర్కొన్నారు. సర్పంచులంతా ఐక్యతతో పనిచేస్తే గ్రామాల అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని మండల అధ్యక్షుడు నీరుడి వెంకటేశం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి గ్రామం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసే అవకాశం ఉంటుందన్నారు.