27-01-2026 08:57:02 PM
-మేనేజర్ అలివేలు
మిర్యాలగూడ,(విజయక్రాంతి): రిజర్వు బ్యాంకు మార్గ నిర్దేశాల మేరకు పనిచేస్తున్న వివిధ రంగాల బ్యాంకులలో వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మిర్యాలగూడ బ్రాంచ్ మేనేజర్ కందుకూరి అలివేలు అన్నారు. మంగళవారం బ్యాంకు ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఒక రోజు సమ్మె చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు బ్యాంకు సిబ్బందిపై పని భారం తగ్గించాలని, అందులో భాగంగానే తమ న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది లక్ష్మీప్రసాద్, కరుణాకర్, కోటేశ్వరరావు, పి. లక్ష్మణ్,వి.ఆనంద్, శాంతిలత, మంజులత, లక్ష్మీ ప్రియ, భూదేవి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.