27-01-2026 08:28:48 PM
బోథ్,(విజయక్రాంతి): పలు ప్రభుత్వ పాఠశాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం బోథ్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ మహేందర్ పలువురు కాంగ్రెస్ నాయకులు కలిసిభూమి పూజ చేశారు. జడ్పిఎస్ఎస్ బాలుర, జడ్పిఎస్ఎస్ ఉర్దూ, ప్రభుత్వ హై స్కూల్, ఎంపీపీఎస్ గర్ల్స్ పాఠశాలలలో కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి, కిచెన్ షెడ్ల నిర్మాణానికి రూ.40 లక్షల రూపాయల నిధులు వెచ్చించనున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అన్నపూర్ణ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్, వారి భద్రత, సురక్షిత వాతావరణమే రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అన్ని విధాలుగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గోర్ల రాజు యాదవ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.